Telangana Inter Results 2026 – ఏప్రిల్ 10 లోపు ఇంటర్మీడియట్ ఫలితాలు!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Inter Results 2026 Update

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. పరీక్షలు ముగియడంతో ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 10వ తేదీ లోపు ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 4 లేదా 5వ తేదీల్లోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి అన్ని ప్రధాన సబ్జెక్టుల పేపర్ల వ్యాల్యూషన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే లాంగ్వేజ్ పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ మొదలైంది.

AP EAPCET Results 2026 – ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఇంటర్ బోర్డు కఠినమైన చర్యలు తీసుకుంటోంది. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 స్పాట్ క్యాంపులను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఒకేషనల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వేల్యూషన్ క్యాంపు అందుబాటులో ఉంది. సుమారుగా 30 వేల మంది అధ్యాపకులు ఈ మూల్యాంకన ప్రక్రియలో పాల్గొంటున్నారు.

ఇంటర్ బోర్డు సెక్రటరీ ఏమన్నారంటే

విద్యార్థుల టెన్షన్ తగ్గించేందుకు వీలైనంత త్వరగా ఫలితాలు ఇవ్వాలని చర్యలు తీసుకుంటున్నాం, వాల్యూయేషన్ ప్రక్రియను చాలా పగడ్బందీగా నిర్వహిస్తున్నాం.. అని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తెలిపారు.

AP Inter Supplementary Results 2026 – ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ & ఇంప్రూవ్మెంట్ 2026 ఫలితాలు విడుదల

వాల్యుయేషన్ ప్రక్రియలో ఏదైనా ఆలస్యమైతే మాత్రం ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి కాబట్టి విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

TG Inter Results 2026 Released | తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!