AP Govt Jobs 2026: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మొత్తం 147 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. 26 జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి రెండు సంవత్సరాల ముందే డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి.
డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మరియు టెక్నికల్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఉండదు.
డ్రైవింగ్ స్కిల్ టెస్ట్

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు తేదీల వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో త్వరలోనే విడుదల చేస్తారు.
