APPSC Executive Officer Grade-3 Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 104 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 16 వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ అక్టోబర్ 16వ తారీఖున అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు.
ఏదైనా డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 44 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం రూ.25,220 నుంచి రూ.80,910 వరకు ఉంటుంది. జీతంతో పాటు ఇతర అలవెన్స్ల్ కూడా ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారిక వెబ్సైట్లో 16-10-2026 తేదీ నుంచి 05-11-2026 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-2 లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టం నుంచి 150 ప్రశ్నలు వస్తాయి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టులో అభ్యర్థులు క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

