AP Police Constable Notification 2026: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మొత్తం 1156 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్ మాన్, జైల్ వార్డర్ మెన్, జైల్ వార్డర్ ఉమెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు తేదీలు, ప్రిలిమినరీ పరీక్ష తేదీ వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు.

ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైర్ మెన్, జైల్ వార్డర్ ఉద్యోగాలకు 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ప్రిమినరీ పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సిలబస్ వివరాలు

