TS Anganwadi Jobs 2026: తెలంగాణలోని మరొక జిల్లాలో 246 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలు భర్తీకి మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 246 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 92 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 154 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూలై 17వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ కాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, సంగారెడ్డి జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

సంగారెడ్డి జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 246 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 92 టీచర్ పోస్టులు, 154 హెల్పర్ పోస్టులు. జోగిపేట్, నారాయణఖేడ్, పటాన్ చెరువు, సదాశివపేట, జహీరాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం
  • జోగిపేట్ ప్రాజెక్టు పరిధిలో 16 టీచర్ 6 హెల్పర్ పోస్టులు
  • నారాయణఖేడ్ 34 టీచర్ 123 హెల్పర్
  • పటాన్ చెరువు: 14 టీచర్ – 5 హెల్పర్
  • సదాశివపేట 13 టీచర్
  • జహీరాబాద్ 15 టీచర్ 20 హెల్పర్

గమనిక: ప్రాజెక్టుల వారీగా, గ్రామాల వారీగా/ వార్డుల వారీగా ఉన్న ఖాళీల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details PDF డౌన్లోడ్ చేసుకోగలరు. ఏ ప్రాంతంలో ఖాళీ పోస్టు ఉంది, ఆ పోస్టును ఏ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు అనే వివరాలు అన్ని తెలుసుకోవచ్చు.

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు లేనట్లయితే 10వ తరగతి అర్హత కలిగిన వారికే అవకాశం కల్పిస్తారు.

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.

దరఖాస్తు విధానం

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • 06-07-2026 తేదీ నుంచి 17-07-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్లు

  • విద్యార్హత ధ్రువీకరణ పత్రములు (10th, Inter)
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Online Application form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!