Hyderabad Anganwadi Jobs: హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hyderabad Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 181 అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Hyderabad Anganwadi Jobs Notification 2026 Details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 5 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. (వార్డుల వారీగా ఖాళీల వివరాల కొరకు, రిజర్వేషన్ల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details లింకుపై క్లిక్ చేయండి)

Anganwadi Recruitment 2026
సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ | ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ

ఖాళీలు గల ప్రాజెక్టుల వివరాలు

  • చార్మినార్ 40 పోస్టులు
  • గోల్కొండ 25 పోస్టులు
  • ఖైరతాబాద్: 17 పోస్టులు
  • నాంపల్లి 38 పోస్టులు
  • సికింద్రాబాద్ 59 పోస్టులు
  • మొత్తం పోస్టులు: 181

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది

Age limit

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

ఇంటర్మీడియట్ విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష, లేదు ఫీజు లేదు

దరఖాస్తు విధానం

  • అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • 29-07-2026 తేదీ నుంచి 22-08-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్లు

  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (10th, ఇంటర్)
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

Online Application form

Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!