Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Police Constable Notification 2026: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TGPRB) నుంచి 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్ధర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఫిజికల్ టెస్ట్, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Telangana Police Constable Notification 2026 details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 7,112 కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్డర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు .

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం
  • పోలీస్ కానిస్టేబుల్ (Civil): 3,697 పోస్టులు
  • పోలీస్ కానిస్టేబుల్ (AR): 1,052 పోస్టులు
  • పోలీస్ కానిస్టేబుల్ (SARCPL-Men): 24 పోస్టులు
  • కానిస్టేబుల్ (SPF): 1,380 పోస్టులు
  • ఫైర్ ఫైటర్: 751 పోస్టులు
  • జైల్ వార్డర్ (Men): 196 పోస్టులు
  • జైల్ వార్డర్ (Women): 12 పోస్టులు
  • మొత్తం: 7,112 పోస్టులు

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత (లేదా) రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైర్ ఫైటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Age limit

కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్డర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎవరు ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

  • కానిస్టేబుల్ (Civil): పురుషులు & మహిళలు
  • కానిస్టేబుల్ (AR): పురుషులు & మహిళలు
  • కానిస్టేబుల్ (SPF): పురుషులు & మహిళలు
  • ఫైర్ ఫైటర్: పురుషులు & మహిళలు
  • కానిస్టేబుల్ (SARCPL): పురుషులు మాత్రమే
  • జైల్ వార్డర్ (Men): పురుషులు మాత్రమే
  • జైల్ వార్డర్ (Women): మహిళలు మాత్రమే

ఎంపిక విధానం

  • Preliminary Written Test
  • Physical Measurements Test
  • Physical Efficiency Test
  • Final Written Examination
  • Certificate Verification
  • Medical Test
  • సిలబస్ వివరాల కొరకు అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

ఫిజికల్ టెస్ట్

Physical Measurements Test:

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • పురుషులు హైట్: 167.6 c.m
  • మహిళలు హైట్: 152.5 c.m

Physical Efficiency Test:

  • పరుగు పరీక్ష:
  • పురుషులు 1600 మీటర్ల పరుగు పందెం 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలి
  • మహిళలు 800 మీటర్ల పరుగు పందెం 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయాలి
  • లాంగ్ జంప్:
  • పురుషులు 4 మీటర్లు దూకాలి
  • మహిళలు 2.50 మీటర్లు దూకాలి
  • షాట్ పుట్:
  • పురుషులు 7.26 Kgs బరువు 6 మీటర్లు విసిరాలి
  • మహిళలు 4 Kgs పరువు 4 మీటర్లు విసరాలి

దరఖాస్తు విధానం

  • తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TGPRB) అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
  • Part-1 ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి
  • ఫొటో, సంతకం అప్లోడ్ చేయాలి
  • ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత Part-2 అప్లికేషన్ సమర్పించాలి
  • దరఖాస్తు తేదీలు అప్లికేషన్ ఫీజు వివరాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో త్వరలో ప్రకటిస్తారు

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!