తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Police Constable Jobs: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి 7112 కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Police Constable Jobs 2026

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

ఇంటర్మీడియట్ విద్యార్హత (లేదా) సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఫైర్ ఫైటర్ పోస్టులకు మాత్రం ఇంటర్ అర్హతతో పాటు LMV డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్

ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కానిస్టేబుల్ ఉద్యోగాలకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, తర్వాత ఫీజు చెల్లించి, ఆ తర్వాత పార్ట్-1 అప్లికేషన్ ఫారం నింపాలి. దరఖాస్తు తేదీల వివరాలు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో త్వరలో వెల్లడించబడతాయి.

క్రింది Download PDF లింక్ పై క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుగు భాషలో తెలుసుకోగలరు

Download PDF

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!