APPSC Endowment Officer Syllabus 2026: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 104 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ వివరాలు, పరీక్ష విధానం వివరాలు తెలుసుకుందాం..
సిలబస్ – పరీక్ష విధానం
ఈ పరీక్ష డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఇందులో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
పేపర్-1: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పేపర్-2: హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టం సంబంధించి 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
APPSC Endowment Officer Syllabus 2026
పేపర్-1 సిలబస్: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ
1.కరెంట్ అఫైర్స్:
అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ అంశాల గురించి చదువుకోవాలి.
2.జనరల్ సైన్స్:
నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు గురించి చదువుకోవాలి.
3.భారతదేశ చరిత్ర:
ఆంధ్రప్రదేశ్ మరియు భారత జాతీయ ఉద్యమం పై ప్రత్యేక దృష్టితో భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ అంశాల గురించి చదువుకోవాలి.
4.ఇండియన్ జాగ్రఫీ:
ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారత భౌగోళిక శాస్త్రం గురించి చదువుకోవాలి.
5.ఇండియన్ పాలిటి:
భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన: రాజ్యాంగపరమైన సమస్యలు, ప్రజా విధానాలు, సంస్కరణలు మరియు ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు గురించి చదువుకోవాలి.
6.ఇండియన్ ఎకానమీ:
భారత ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళికల గురించి చదువుకోవాలి. ముఖ్యంగా తాజా బడ్జెట్ వివరాలు మరియు పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకోవాలి.
7.సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ గురించి చదువుకోవాలి.
8.విపత్తు నిర్వహణ:
విపత్తు సమయంలో ప్రమాదాల తీవ్రత, నివారణ మరియు ఉపశమన వ్యూహాల గురించి చదువుకోవాలి. విపత్తు అంచనాలో రిమోట్ సెన్సింగ్ మరియు GIS సాంకేతిక వినియోగం గురించి తెలుసుకోవాలి.
9.లాజికల్ రీజనింగ్ మరియు అనలిటికల్ ఎబిలిటీ గురించి చదువుకోవాలి. (ప్రాక్టీస్ చేయాలి)
10.డేటా అనాలసిస్:
డేటా విశ్లేషణ గురించి ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా డేటా పట్టికలు, గ్రూపుల రూపంలో డేటా ప్రదర్శన, ప్రాథమిక డేటా విశ్లేషణ (సరాసరి, మధ్యస్థం, బహుళకం మరియు విస్తృతి) మరియు వివరణ గురించి చదువుకోవాలి.
పేపర్-2 సిలబస్: హిందూ ఫిలాసఫీ & టెంపుల్ సిస్టం
1.రామాయణం:
రామాయణంలోని వివిధ పాత్రల గురించి తెలుసుకోవాలి, రామాయణంలోని వివిధ భాగాలు (కాండాలు), రామాయణంలో పేర్కొన్న రాజవంశాలు, రామాయణంలో పేర్కొన్న వివిధ ప్రదేశాల గురించి చదువుకోవాలి.
2.మహాభారతం:
మహాభారతంలోని వివిధ పాత్రల గురించి ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. మహాభారతంలోని వివిధ భాగాలు (పర్వాలు), మహాభారతంలో పేర్కొన్న రాజవంశాలు, మహాభారతంలో పేర్కొన్న వివిధ ప్రదేశాల గురించి చదువుకోవాలి.
3.భాగవతం:
భాగవతంలోని వివిధ పాత్రల గురించి తెలుసుకోవాలి. భాగవతంలో పేర్కొన్న వివిధ భాగాలు (స్కందాలు), భాగవతంలో పేర్కొన్న వివిధ ప్రదేశాల గురించి తెలుసుకోవాలి.
4.హిందూ పురాణాలు:
వివిధ హిందూ పురాణాల గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. హిందూ పురాణాలలో పేర్కొన్న వివిధ ప్రదేశాల గురించి తెలుసుకోవాలి.
5.దేవాలయ ఆగమాలు:
హిందూ శాస్త్రాలలోని వివిధ ఆగమాలు:
1).వైష్ణవం: a).వైఖానసం b).పాంచరాత్రం c).చట్టాడ శ్రీవైష్ణవం
2).శైవం: a).స్మర్థం b).ఆది శైవ c).వీర శైవ d).జంగమ e).కాపాలిక మొదలైనవి.
3).మాతృదేవతలు: శక్తేయం
6.హిందూ పండుగలు:
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగలు మరియు భారతదేశానికి చెందిన శాస్త్రీయ లలిత కళలు గురించి చదువుకోవాలి.
7.వైదిక సంస్కృతి:
వైదిక సంస్కృతిలో యజ్ఞాలు, యాగాలు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు మరియు జీవితంలోని వివిధ దశలలో పాటించాల్సిన ధర్మాలు గురించి తెలుసుకోవాలి.
8.హిందూ మతంలోని వివిధ తత్వాలు, సాంప్రదాయాలు మరియు గురువులు:
ఆళ్వార్లు – వైష్ణవ గురువులు
నాయనార్లు – శైవ గురువులు
శంకరాచార్య – అద్వైతం
రామానుజాచార్య – విశిష్టాద్వైతం
మధ్వాచార్య – ద్వైతాద్వైతం
బసవేశ్వరుడు – వీరశైవం
9.హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణం, దత్తత మరియు వారసత్వం గురించి తెలుసుకోవాలి.
10.దేవాలయాల ఆదాయ వనరులు:
దేవాలయాలు, దేవాదాయ సంస్థల ఆదాయ మార్గాలు మరియు నిధుల కేటాయింపు.. నిబంధనలు గురించి తెలుసుకోవాలి. దేవాదాయ చట్టం 30/87 లోని సెక్షన్ 57 గురించి కూడా తెలుసుకోవాలి.
11.ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు:
ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు బాధ్యతల గురించి తెలుసుకోవాలి. దేవాదాయ చట్టం 30/87 లోని సెక్షన్ 29 గురించి తెలుసుకోవాలి.
12.భూ రికార్డులు & దేవాదాయ భూముల చట్టాలు:
భూ రికార్డుల గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ROR యాక్ట్ (పట్టాదారు పాసు బుక్ చట్టం) మరియు దేవాదాయ చట్టం 30/87లోనే సెక్షన్ 75 నుండి 86 వరకు ఉన్న భూమి సంబంధిత నిబంధనల గురించి తెలుసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి
✅AP Endowment Executive Officer Grade-3, APPSC Group-2, AP SI/Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
APPSC Endowment Officer Syllabus 2026 in English



