Anganwadi Jobs: తెలంగాణలో 178 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 178 అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 178 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. గమనిక: గ్రామాల వారీగా/ వార్డుల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details పై క్లిక్ చేయండి.

  • పాల్వంచ 29 పోస్టులు
  • మణుగూరు 24 పోస్టులు
  • ఇల్లేందు: 21 పోస్టులు
  • టేకులపల్లి 19 పోస్టులు
  • కొత్తగూడెం 16 పోస్టులు
  • దమ్మపేట: 16 పోస్టులు
  • దుమ్ముగూడెం 12 పోస్టులు
  • చర్ల 12 పోస్టులు
  • అశ్వరావుపేట 11 పోస్టులు
  • చంద్రుగొండ 8 పోస్టులు
  • బూర్గంపాడు 10 పోస్టులు

విద్యార్హతలు

ఇంటర్మీడియట్ విద్యారత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలి.

TGPSC Seed Certification Officer Recruitment 2026 – తెలంగాణలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | జీతం: రూ.51,320

Anganwadi Jobs Age limit

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

ఇంటర్మీడియట్ విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • 03-07-2026 తేదీ నుంచి 18-07-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
  • క్రింద ఇవ్వబడిన Online Application form పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు కు కావలసిన సర్టిఫికెట్లు

  • విద్యార్హత ధ్రువీకరణ పత్రములు (10th, ఇంటర్)
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్
  • వితంతువులు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

ధ్రువపత్రాల పరిశీలన తేదీలు

20-07-2026 తేదీ నుంచి 07-08-2026 తేదీ లోపు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరుకావలెను.

Telangana Anganwadi Jobs 2026 – ఇంటర్ అర్హతతో తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

Online Application form

Telangana Anganwadi Jobs 2026: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!