Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అంగన్వాడి టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 79 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్ట్ ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 31వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Anganwadi Recruitment 2026 Notification

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 55 అంగన్వాడి టీచర్ పోస్టులు, 24 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆలేరు, భువనగిరి, మోత్కూర్, రామన్నపేట ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. (గ్రామాల వారీగా/ వార్డుల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు కొరకు కింద ఇవ్వబడిన Vacancy Details పై క్లిక్ చేయండి)

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం
  • ఆలేరు: 9 టీచర్, 7 హెల్పర్ పోస్టులు
  • భువనగిరి: 3 టీచర్, 13 హెల్పర్ పోస్టులు
  • మోత్కూర్: 31 టీచర్ పోస్టులు
  • రామన్నపేట: 12 టీచర్, 4 హెల్పర్ పోస్టులు

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు లేనట్లయితే పదవ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు.

వయోపరిమితి

ఈ ఉద్యోగాలకు 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 22-07-2026 తేదీ నుంచి 31-07-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. (క్రింద ఇవ్వబడిన Online Application form అనే లింక్ పై క్లిక్ చేసి మీ మోబైల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు)

దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్లు

  • విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (10th క్లాస్, ఇంటర్)
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Online Application form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!