Telangana Anganwadi Jobs 2026 – ఇంటర్ అర్హతతో తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ములుగు జిల్లా నుంచి అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 135 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు నందు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే అంగన్వాడీ పోస్టు ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ములుగు జిల్లా.. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 31 అంగన్వాడీ టీచర్, 104 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టుల నందు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రామాల వారీగా/ వార్డుల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

వయోపరిమితి

01.07.2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు కచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నవారు లేనట్లయితే.. పదవ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్లు

  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు
  • అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్
  • వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

దరఖాస్తు తేదీలు

01.07.2026 తేదీ నుంచి 15-07-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Download Notification

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vacancy Details

Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!