APPSC Group-2: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 900 పోస్టులు భర్తీ.. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 900 గ్రూప్-2 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది.

✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 900 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన 508 గ్రూప్-2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా గ్రూప్-2 కింద దాదాపు 900 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. పది రోజుల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్ కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Group-2 Syllabus

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our App

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!