APPSC Group 2 Syllabus: గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల.. PDF డౌన్లోడ్ చేసుకోండి
APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఆగస్టు 28న జీవో జారీ చేసింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేసింది.
APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఆగస్టు 28న జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేసింది. ఏప్రిల్ 27న గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్షల యొక్క పూర్తిస్థాయి సిలబస్ ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెబ్సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పూర్తిస్థాయి సిలబస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్
స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
మెయిన్స్ సిలబస్
మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ PDF డౌన్లోడ్ చేసుకోగలరు
అతి తక్కువ ధరలో ‘గ్రూప్-2’ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి