AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Jobs 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 55 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

AP Anganwadi Jobs Notification 2026 Details

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 55 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి సెంటర్ల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్థులు కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు

అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.7,000 ఉంటుంది.

ఎంపిక విధానం

10వ తరగతిలో వచ్చిన మార్పుల మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

దరఖాస్తు విధానం

Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి. మరిన్ని వివరాలకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించగలరు.

దరఖాస్తుల చివరి తేదీ

16-04-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!