10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Jobs Notification 2026: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నంద్యాల జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 106 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. 

పోస్టుల వివరాలు:

అంగన్వాడీ వర్కర్: 05
అంగన్వాడి హెల్పర్: 101
మొత్తం ఖాళీల సంఖ్య: 106.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

విద్యార్హతలు: 

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

01-07-2026 తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

అంగన్వాడీ వర్కర్: రూ.11,500/-
మినీ అంగన్వాడి వర్కర్: రూ.7,000/-
అంగన్వాడి హెల్పర్: రూ.7,000/-

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఎంపిక విధానం:

10వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి అదే ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు జతపరచాలి. మరిన్ని వివరాలకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించగలరు.

దరఖాస్తుకు చివరి తేదీ:

ఈ ఉద్యోగాలకు 14-04-2026 తేదీ నుంచి 23-04-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!