AP District Court Jobs 2026 – 10th అర్హతతో ఏపీ జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP District Court Jobs 2026: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నంలో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ‘రికార్డ్ అసిస్టెంట్’ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం రెండు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

వయోపరిమితి

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

విద్యార్హతలు

10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.15,000 ఉంటుంది.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Police Constable Notification 2026 | ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థుల Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ తో పాటు ఉన్న దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకొని, వివరాలను నింపి, కావలసిన ధ్రువపత్రాల నకల్లను దరఖాస్తు ఫారానికి జత చేసి రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సమర్పించవలెను. దరఖాస్తు తో పాటు సమర్పించవలసిన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీల వివరాలు కింద చూడగలరు.

  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
  • ఆధార్ కార్డు
  • అనుభవ దృవీకరణ పత్రం
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో

దరఖాస్తుకు చివరి తేదీ

24-06-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా

కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయానికి దరఖాస్తులు పంపవలెను.

APPSC FBO Notification 2026 – ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!