TGPSC Group 3: తెలంగాణ గ్రూప్-3 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Group-3 Hall Tickets: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షలను నవంబర్ 17, 18 తారీకుల్లో నిర్వహిస్తున్నారు. రాతపరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 387 మంది పోటీ పడుతున్నారు.

గ్రూప్-3 పరీక్షలను నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. మూడు పేపర్లలో కలిపి 450 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Hall Ticket

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

Whatsapp Group Link

Telegram Group Link

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!