TSPSC: తెలంగాణ గ్రూప్-4 పరీక్షల తేదీ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్షల తేదీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. 2023 జులై 1 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. గ్రూప్-4 ఉద్యోగాలకు ఇప్పటికే 9 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 ఉద్యోగాల కోసం గ్రూప్-4 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఏదైనా డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

గ్రూప్-4: 8,180 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 3వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80

జీతభత్యాలు:

రూ.24,280/- నుంచి 72,850/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Warangal Court Office Attendant Jobs
10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Apply Online

Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!