TSPSC: గ్రూప్-4 ఉద్యోగాలకు ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు 9 లక్షలు దాటాయి. గురువారం సాయంత్రానికి 9,15,872 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-4 పరీక్షల తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 2023 జూలై 1వ తేదీ ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించనుంది.
ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఇటీవల అదనంగా 141 పోస్టులను కలిపారు. దీంతో మొత్తంగా 8,180 గ్రూప్ 4 పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Apply Online

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

Website

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!