TG Anganwadi Notification 2026 – తెలంగాణలో 179 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Anganwadi Notification 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలు భర్తీకి మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నిజామాబాద్ జిల్లా నుంచి 179 అంగన్వాడీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 76 టీచర్ పోస్టులు, 103 హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 23వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

నిజామాబాద్ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని 5 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 179 అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 76 టీచర్ పోస్టులు, 103 హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. (గ్రామాల వారీగా/ వార్డుల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details PDF డౌన్లోడ్ చేసుకోండి)

TS Anganwadi Jobs 2026: తెలంగాణలోని మరొక జిల్లాలో 246 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఖాళీలు గల ఐసిడిఎస్ ప్రాజెక్టులు

  • ఆర్మూర్
  • భీంగల్
  • బోధన్
  • డిచ్ పల్లి
  • నిజామాబాద్

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనట్లయితే పదవ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు.

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Telangana Police Recruitment 2026 – పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తీ | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల

దరఖాస్తు విధానం

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • 08-07-2026 తేదీ నుంచి 23-07-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 27-07-2026 తేదీ నుంచి 05-08-2026 తేదీ లోపు ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో హాజరు కావాలి

దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్లు

  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • విద్యార్హత ధ్రువీకరణ పత్రములు
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • వితంతువులు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

Online Application form

Anganwadi Jobs: తెలంగాణలో 178 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!