Anganwadi Jobs: ఇంటర్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 73 పోస్టులో భర్తీ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ 64, హెల్పర్ 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్ 64, హెల్పర్ 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. గద్వాల, మల్దకల్, మనోపాడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు లేనట్లయితే పదవ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు.

Anganwadi Jobs Age limit

01-07-2026 తేదీ నాటికే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

దరఖాస్తు విధానం

అంగన్వాడి టీచర్, హెల్పర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింది లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

ఆన్లైన్ దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్లు

  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • విద్యార్హత ధ్రువీకరణ పత్రములు
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్
  • వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

దరఖాస్తు తేదీలు

29.06.2026 తేదీ నుంచి 08.07.2026 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!