AP TRANSCO AEE Notification 2026: ఏపీ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP TRANSCO AEE Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాన్స్కో పరిధిలో 200 పోస్టులు, జెన్కో పరిధిలో 100 పోస్టులు, ఎస్పీడీసీఎల్ పరిధిలో 134 పోస్టులు, ఈపీడీసీఎల్ పరిధిలో 135 పోస్టులు, సీపీడీసీఎల్ పరిధిలో 60 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడివిడిగా పత్రిక ప్రకటన రూపంలో విడుదల చేశారు. సంబంధిత వెబ్సైట్లలో పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని.. విద్యార్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం, సిలబస్ వివరాలు తెలుసుకోగలరు. ఇప్పటికే ఏపీ ఎస్పీడీసీఎల్ ఏఈఈ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్లో విడుదలైంది. 2026 జూన్ 30వ తారీకు నుంచి 2026 జూలై 20వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అతి త్వరలోనే మిగతా నోటిఫికేషన్లను సంబంధిత అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP TRANSCO

  • ఏఈఈ (ఎలక్ట్రికల్): 167 పోస్టులు
  • ఏఈఈ (సివిల్): 23 పోస్టులు
  • ఏఈఈ (టెలికాం): 10 పోస్టులు

AP GENCO

  • ఏఈఈ (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్): 80 పోస్టులు
  • ఏఈఈ (సివిల్): 20 పోస్టులు

APEPDCL

  • ఏఈఈ (ఎలక్ట్రికల్): 128 పోస్టులు
  • ఏఈఈ (సివిల్): 04 పోస్టులు
  • ఏఈఈ (టెలికాం): 03 పోస్టులు

APSPDCL

  • ఏఈఈ (ఎలక్ట్రికల్): 124 పోస్టులు
  • ఏఈఈ (సివిల్): 06 పోస్టులు
  • ఏఈఈ (టెలికాం): 04 పోస్టులు

APCPDCL

  • ఏఈఈ (ఎలక్ట్రికల్): 56 పోస్టులు
  • ఏఈఈ (సివిల్): 03 పోస్టులు
  • ఏఈఈ (టెలికాం): 01 పోస్టు

ఏఈఈ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్న పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఈఈ సివిల్ విభాగంలో ఉన్న పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏఈఈ టెలికాం విభాగంలో ఉన్న పోస్టులకు టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ప్రభుత్వా నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!