APSPDCL AEE Recruitment 2026: ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలో ఏఈఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSPDCL AEE Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో మొత్తం 135 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ నుంచి జూలై 20వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

APSPDCL AEE Recruitment 2026 details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 135 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

  • AEE (Electrical): 125 పోస్టులు
  • AEE (Civil): 06 పోస్టులు
  • AEE (Telecom): 04 పోస్టులు

విద్యార్హతలు

  • AEE (Electrical): ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన పెద్దలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • AEE (Civil): ఈ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చ
  • AEE (Telecom): ఈ పోస్టులకు టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జీతభత్యాలు

ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం ప్రొబేషన్ పీరియడ్ లో రూ.75,000; ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ స్కేల్ రూ.86,245 ఉంటుంది. పే స్కేల్ తో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBT), సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలను 22.08.2026 తేదీ నుంచి 29.08.2026 తేదీ వరకు నిర్వహిస్తారు.

పరీక్ష విధానం

కంప్యూటర్ ఆధారిత పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. సబ్జెక్టుల వారుగా వచ్చే ప్రశ్నల వివరాలు క్రింద చూడగలరు.

  • సంబంధిత కోర్ సబ్జెక్టు: 70 మార్కులు
  • రీజనింగ్ ఐదు మార్కులు
  • జనరల్ అవేర్నెస్ ఏడు మార్కులు
  • ఇంగ్లీష్ నాలెడ్జ్ మార్కులు
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎనిమిది మార్కులు
  • కంప్యూటర్ నాలెడ్జ్ 5 మార్కులు

APSPDCL లోకల్ పరిధిలోకి వచ్చే జిల్లాలు

తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, వైయస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు ఎస్పీడీసీఎల్ లోకల్ పరిధిలోకి వస్తాయి. ఈ తొమ్మిది జిల్లాలకు చెందిన అభ్యర్థులు 95% పోస్టులకు పోటీ పడవచ్చు. మిగతా జిల్లాల వారు మిగిలిన 5% పోస్టులకు మాత్రమే పోటీపడాలి.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పరీక్ష కేంద్రాలు

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు APSPDCL అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

రూ.1,000/- ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.

దరఖాస్తు తేదీలు

అభ్యర్థులు తేదీ నుంచి తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!