Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్ నగర్ జిల్లా లోని నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 177 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
Telangana Anganwadi Jobs 2026 Notification details
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలోని నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 64 అంగన్వాడీ టీచర్, 113 ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఐసిడిఎస్ ప్రాజెక్టుల వివరాలు
దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్ అర్బన్, మహబూబ్ నగర్ రూరల్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు
అంగన్వాడి టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఆయా పోస్టులకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు తేదీలు
20-06-2026 తేదీ నుంచి 30-06-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

