December 9, 2024
TS Govt Jobs

తెలంగాణ కరెంట్ ఆఫీసుల్లో రూ.64,000/- జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు ఎంపిక విధానం

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 23 వ తారీకు నుంచి 2023 మార్చి 15వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులు

వయోపరిమితి:

2023 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST/BC/ EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు:

ఇంజనీరింగ్ డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ( ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)

జీతభత్యాలు:

రూ.64,295/- నుంచి రూ.99,345/- వరకు

ఎంపిక విధానం:

రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు .
రాతపరీక్షను 2023 ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహిస్తారు.
2023 ఏప్రిల్ 24 వ తారీకు నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఫిబ్రవరి 23వ తారీకు నుంచి 2023 మార్చి 15వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Download Notification

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!