1,284 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (ట్రేడ్స్ మన్) ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,284 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కోబ్లర్, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ వాషర్ మెన్, కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ స్వీపర్, కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్, కానిస్టేబుల్ వెయిటర్ ట్రేడుల విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ (ట్రేడ్స్ మన్): 1,284 పోస్టులు
పురుష అభ్యర్థులకు: 1,220 పోస్టులు
మహిళా అభ్యర్థులకు: 64 పోస్టులు
వయోపరిమితి:
18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
రూ.21,700/- నుంచి రూ.69,100 వరకు
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఫిబ్రవరి 26వ తారీకు నుంచి 2023 మార్చి 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి