May 28, 2024
TS Govt Jobs

TSPSC: తెలంగాణ గ్రూప్-4 కు భారీగా దరఖాస్తులు..ఎన్ని లక్షలు వచ్చాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు ఆరు లక్షలు దాటాయి. సోమవారం సాయంత్రానికి 6,14,234 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. రోజుకి సగటున 24 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య 9 లక్షలకు చేరువయ్యే అవకాశముంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Apply Online

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!