December 6, 2024
TS Govt Jobs

TSPSC: గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరిగేనా?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రీషెడ్యూలు చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 ను కూడా రీషెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికి నిర్వహిస్తుందా? అని అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్న ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం, ఒకవేళ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగితే ప్రిపరేషన్ ప్రణాళికల్లో కూడా మార్పులు చేసుకునేలా మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-4 పరీక్షను జూలై 1వ తేదీన, గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన కమిషన్, జూన్ 11న మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఈ మూడింటినీ వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయా? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా? అనే విషయాలను పరిగణలోకి తీసుకుని టిఎస్పిఎస్సి ఈ పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!