TSPSC: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-4 రాతపరీక్ష తేదీలు ఇవే..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కొన్ని పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2,.. 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న, గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. గ్రూప్-2 ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీ పడుతున్నారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!