September 11, 2024
TS Govt Jobs

TSPSC: తెలంగాణ గ్రూప్-2 గ్రూప్-4 బిట్ బ్యాంక్… పెద్దమనుషుల ఒప్పందం

1.పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
Ans: 1956 ఫిబ్రవరి 20

2.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది?
Ans: ఢిల్లీలోని హైదరాబాద్ అతిథిగృహంలో

3.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుండి ఎంత మంది సంతకాలు చేశారు?
Ans: 4

4.పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుంచి సంతకం చేసిన వారు ఎవరు?
Ans: బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, కె.వి. రంగారెడ్డి, జి.వి. నర్సింగరావు

5.పెద్దమనుషుల ఒప్పందం పై ఆంధ్ర ప్రాంతం నుంచి సంతకాలు ఎవరు చేశారు?
Ans: బి. గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ఎ. సత్యనారాయణరాజు

6.1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం అప్పటి కేంద్ర హోంమంత్రి సమక్షంలో జరిగింది. కేంద్ర హోంమంత్రి ఎవరు?
Ans: గోవింద వల్లభ్ పంత్

7.ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి ఆరోవేలు లాంటిది అది నిరుపయోగమైనది అని పేర్కొన్నది ఎవరు?
Ans: నీలం సంజీవరెడ్డి

8.పెద్దమనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకం చేశారు?
Ans: 8 మంది

9.పెద్దమనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది?
Ans: 14 అంశాలు

10.పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్యమైన 5 మంత్రి పదవుల్లో రెండు మంత్రి పదవులు తెలంగాణ వారికే కేటాయించాలి. అయితే ఆ ఐదు మంత్రి పదవులు ఏవి?
Ans: హోంశాఖ , రెవెన్యూశాఖ , ఆర్థికశాఖ , ప్రణాళిక అభివృద్ధి శాఖ , వాణిజ్య పరిశ్రమల శాఖ

11.పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర – తెలంగాణ దామాషా 60:40 గా నిర్ణయించారు. అయితే తెలంగాణ మంత్రుల్లో ఎందరు ముస్లింలు ఉండాలి?
Ans: ఒకరు

12.పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి పర్యవేక్షణలో జరగాలి?
Ans: ప్రాంతీయ సంఘం

13.తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం పర్యవేక్షణలో జరగాలి. అయితే ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు?
Ans: 371 ఆర్టికల్

14.పెద్దమనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆవిర్భవించింది?
Ans: 1956 నవంబర్ 1

15.పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరు?
Ans: బూర్గుల రామకృష్ణారావు

16.పెద్దమనుషుల ఒప్పందం తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి గవర్నర్ ఎవరు?
Ans: చందూలాల్ మాధవ్ త్రివేది

17.పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ అవసరాలకు , అభివృద్ధికి ఎంత మంది సభ్యులతో కూడిన ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు?
Ans: 20

Join Our Telegram Group: Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!