APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,082 గ్రూప్-2 పోస్టులు గుర్తింపు.. ఖాళీల భర్తీకి సన్నాహాలు
APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
Join Our Telegram Group: Click here
అత్యున్నత సర్వీసులైన గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతించింది. ఆ పోస్టులను ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించారు. అయితే, గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లోని గ్రూప్-2 ఖాళీలను అధికారులు సేకరించారు.హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో 1,082 గ్రూప్-2 ఖాళీలను గుర్తించారు. గ్రూప్-2 విభాగంలో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ కం అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్.. పోస్టులు ఉన్నాయి.
క్రింది పట్టిక ద్వారా గ్రూప్ టూ ఖాళీల వివరాలు తెలుసుకోగలరు