May 28, 2024
TS Govt Jobs

TSPSC Group-2 | నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష.. సెషన్ల వారీగా పరీక్షల వివరాలు

TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబరు నెలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలలో గురుకుల టీచర్ పరీక్షలు, స్టాఫ్ నర్స్, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, ఐబీపీఎస్ వంటి పలు పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), తాజాగా కొత్త తేదీలను ఖరారు చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షలకు వారం రోజుల ముందుగా www.tspsc.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు కమిషన్ తెలిపింది.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 నవంబర్ 2, 3 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. నవంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే నవంబర్ 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!