TS Outsourcing Jobs: తెలంగాణలో 3,124 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ.. జిల్లాల వారీగా ఖాళీలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 3,124 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, మినిమం టైం స్కేల్ విధానంలో భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో 3,124 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, మినిమం టైం స్కేల్ విధానంలో భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో వీరి సర్వీసులను వినియోగించుకునేందుకు అనుమతినిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 968 మందిని కాంట్రాక్టు, 2,029 మందిని ఔట్సోర్సింగ్, 127 మందిని మినిమం టైం స్కేల్ పద్ధతిలో నియమించుకునే అధికారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు ఇచ్చారు. ఇందులో సెక్యూరిటీ గార్డులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, డార్క్ రూం అసిస్టెంట్లు, ఎక్స్-రే అటెండెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్, ANM, MNO/ FNO, డ్రైవర్, స్టాఫ్ నర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు.. తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. త్వరలోనే వైద్య విధాన పరిషత్ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి