TSPSC | గ్రూప్-2 రాతపరీక్ష తేదీ ఖరారు.. పరీక్ష తేదీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆదివారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు గ్రూప్-2 పరీక్ష నిర్వహణ పై అసెంబ్లీ వేదికగా స్పందించారు.

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు స్పందించారు. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్పీఎస్సీ ని ఆశ్రయించారు. అలాగే షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు టీఎస్పీఎస్సీ ని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొందరు సభ్యులు సైతం గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారు సిఎస్ శాంతకుమారి గారితో చర్చించారు. అన్ని పరిశీలించిన తర్వాత గ్రూప్-2 పరీక్ష యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదు. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. అలా చేస్తే ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. మిగిలిన పరీక్షల నిర్వహణపై మరోసారి అధికారులతో చర్చించాలని సిఎస్ శాంతకుమారి గారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. 29వ తేదీ ఉదయం పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే 30వ తేదీ ఉదయం పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!