TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ ప్రిమినరీ ‘కీ’ విడుదల… ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (Civil, IT & CO, PTO) పోస్టులు, ఏఎస్ఐ (FPB) పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ ని ఏప్రిల్ 15 శనివారం నుంచి www.tslprb.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 8, 9 తేదీల్లో అర్థమెటిక్స్ & రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.

వీటిలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని 15 న ఉదయం నుంచి వెబ్సైట్లో లో అందుబాటులో ఉంచారు. వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే .. ఏప్రిల్ 15 ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్సైట్లో సమర్పించవచ్చు. అందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్ అందుబాటులో ఉంచినట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఫైనల్ ‘కీ’ని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్ ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అర్థమెటిక్ & రీజనింగ్, జనరల్ స్టడీస్ పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ వివరాలను ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి లాంగ్వేజ్ పేపర్ల యొక్క ప్రిలిమినరీ ‘కీ’ లను డౌన్లోడ్ చేసుకోగలరు

SI (Civil) key

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SI (IT&CO, PTO, FPB) key

Official Website

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!