TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG TRANSCO Recruitment 2026: తెలంగాణ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TG TRANSCO) నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 250 పోస్టులు భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చస్తున్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, స్టైఫెండ్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

TG TRANSCO Recruitment 2026 | Apprentice Vacancy

🏛️ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

Transmission Corporation of Telangana Limited (TGTRANSCO), హైదరాబాద్ లోని తన కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

🎯 పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 250 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్రైనింగ్ కాల వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 125 పోస్టులు
  • డిప్లొమా అప్రెంటిస్: 125 పోస్టులు

🎓 విద్యార్హతలు

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి EEE, ECE, CSE, Mechanical, Civil or IT విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • డిప్లొమా అప్రెంటిస్: సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (EE, ECE, ME, CE, CSC)

👉Age limit

ఈ పోస్టులకు 18 సంవత్సరాలు పూర్తి అయిన అభ్యర్థులు దరఖాస్తు అర్హులు. ( నోటిఫికేషన్ లో గరిష్ట వయోపరిమితి వివరాలు వెల్లడించలేదు)

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

💰స్టైఫెండ్ ఎంత ఉంటుంది?

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ₹17,500 నెలకు
  • డిప్లొమా అప్రెంటిస్: ₹15,000 నెలకు

✍️ సెలక్షన్ ప్రాసెస్

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. ఎలాంటి ఫీజు ఉండదు.

🌐 దరఖాస్తు విధానం

ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

📆 దరఖాస్తు తేదీలు

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 20-02-2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 27-02-2026
  • NATS పోర్టల్ ద్వారా చివరి తేదీ: 26-02-2026

📌క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!