పోటీ పరీక్షల ప్రత్యేకం: ఆపరేషన్ సింధూర్ ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు కింద ఇవ్వడమైనది. ఆపరేషన్ సిందూర్ టాపిక్ సంబంధించిన ప్రశ్నలు. కోర్టు ఉద్యోగాలు, ఎస్సై/ కానిస్టేబుల్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.

ఆపరేషన్ సింధూర్:

1). పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు?
Ans: ఆపరేషన్ సింధూర్

2). ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులతో ఎప్పుడు దాడులు చేసింది?
Ans: 2025 మే 7న

3). ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక ఆక్రమిత కాశ్మీర్లోనే ఎన్ని ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులతో దాడి చేసింది?
Ans: 9 ఉగ్రవాద స్థావరాలపై

పెద్ద మనుషుల ఒప్పందం

4). ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఆ ఇద్దరు మహిళా అధికారులు ఎవరు?
Ans: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి

5). పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో 1960 సెప్టెంబర్ 19న కరాచీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. సింధూ నది జలాల ఒప్పందంపై ఎవరెవరు సంతకాలు చేశారు?
Ans: నెహ్రూ, అయూబ్ ఖాన్

6). భారత్, పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది?
Ans: 1972 జూలై 2న సిమ్లాలో జరిగింది. (ఇందిరా గాంధీ, జుల్ఫీకర్ అలీ భుట్టో మధ్య)

7). భారత్ పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
Ans: 2025 మే 10న

8). ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్థాన్ వైమానిక, క్షిపణి దాడులకు దిగితే వాటిని నిలువరించేందుకు భారత్ ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం?
Ans: ఎస్-400 (ఇది సంచార క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన అల్మాజ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.)

9). మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాం లోని బైసారన్ ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎంతమంది పర్యాటకులు మృతి చెందారు?
Ans: 26 మంది

10). ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ సాగించిన దాడిని తిప్పి కొట్టడంలో కీలక పాత్ర పోషించిన భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థ ఏది?
Ans: ఆకాశ్ తీర్

✅AP, తెలంగాణ నిరుద్యోగుల కోసం: కోర్టు ఉద్యోగాలు, Forest Beat Officer, SI/Constable, RRB Group-D, SSC MTS ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!