86 వేల జీతంతో AP TRANSCO లో AEE ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల – 200 పోస్టులు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP TRANSCO: ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (AP TRANSCO) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 200 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలక్ట్రికల్, సివిల్ మరియు టెలికాం విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు అర్హులు. సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (AP TRANSCO) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్, సివిల్ మరియు టెలికాం విభాగాల్లో మొత్తం 200 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • AEE (ఎలక్ట్రికల్): 167 పోస్టులు
  • AEE (సివిల్): 23 పోస్టులు
  • AEE (టెలికాం): 10 పోస్టులు
  • మొత్తం: 200 పోస్టులు

విద్యార్హతలు

  • AEE (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AEE (సివిల్): సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు
  • AEE (టెలికాం): టెలి కమ్యూనికేషన్స్ (లేదా) ఎలక్ట్రానిక్స్ (లేదా) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు 52 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు ప్రొబేషన్ కాలంలో రూ.75,000; ప్రొబేషన్ పూర్తయిన తర్వాత నెలకు పే స్కేల్ రూ.86,245 ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలు 22-08-2026 తేదీ నుంచి 29-08-2026 తేదీ వరకు నిర్వహిస్తారు.

పరీక్ష విధానం

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 70 మార్కులకు సంబంధిత బ్రాంచ్ కోర్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్ నుంచి 5 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 7 మార్కులు, ఇంగ్లీష్ నాలెడ్జ్ నుంచి 7 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 8 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. నెగిటివ్ మార్కులు ఉండవు.

కనీస అర్హత మార్కులు

  • OC/ EWS: 40%
  • BC: 35%
  • SC/ ST/ PwBD: 30%

పరీక్ష కేంద్రాలు

దరఖాస్తు విధానం

AP TRANSCO అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు aptransco.gov.in వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. (ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఫీజు చెల్లించి, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి అప్లికేషన్ సమర్పించాలి)

AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

దరఖాస్తు ఫీజు

అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. (ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వబడదు)

దరఖాస్తు తేదీలు

30-06-2026 తేదీ నుంచి 20-07-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Apply Online

AP విద్యుత్ శాఖలో 629 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!