Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Adilabad District Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 242 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 63 టీచర్, 179 హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతలు కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 20వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

Adilabad District Anganwadi Jobs 2026 Notification details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 242 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నార్నూర్, ఉట్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. గ్రామాల వారీగా/ వార్డుల వారీగా ఖాళీల వివరాలు కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details PDF డౌన్లోడ్ చేసుకోండి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం
  • అంగన్వాడీ టీచర్: 63 పోస్టులు
  • అంగన్వాడీ హెల్పర్: 179 పోస్టులు

విద్యార్హతలు

అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనట్లయితే 10వ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు.

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 09-07-2026 తేదీ నుంచి 20-07-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు కు కావలసిన సర్టిఫికెట్లు

  • విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • కుల ధ్రువీకరణ పత్రము
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • వితంతువులు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Online Application form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!