SSC CGL Notification 2025 Out for 14,582 Posts – Apply Online, Eligibility, Vacancies, Exam Dates (In Telugu)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CGL Notification 2025 Details in Telugu

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 (CGL) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14,582 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

SSC CGL 2025 నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-B మరియు గ్రూప్-C పోస్టులను భర్తీ చేస్తారు. Income tax department, Central Secretariat service, CBI, CBN, IB, C&AG, Postal Department మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

👉ముఖ్యమైన తేదీలు (Important Dates)

ఈ ఉద్యోగాలకు 2025 జూన్ 9వ తారీకు నుంచి 2025 జూలై 4 వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ssc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Tier-1 (CBE) పరీక్షలను 2025 ఆగస్టు 13వ తారీకు నుంచి 30వ తారీకు వరకు నిర్వహిస్తారు.

👉 విద్యార్హతలు (Eligibility Criteria)

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

👉 వయోపరిమితి (Age limit)

పోస్టును అనుసరించి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉 ఖాళీల వివరాలు (Vacancy Details)

ఏ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,582 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన పోస్టులు:

Assistant Section Officer, Inspector (Income tax, Central Excise), Auditor, Sub Inspector (CBI, NIA), Junior Statistical Officer, Accountant తదితర పోస్టులు భర్తీ.

👉 దరఖాస్తు ఫీజు (Application fee)

జనరల్, ఓబీసీ అభ్యర్థులు ₹.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 SSC CGL 2025 దరఖాస్తు విధానం (How to Apply)

SSC అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. New User అయితే ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్ పూరించాలి.

👉 ఎంపిక విధానం (Selection Process)

Tier-1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, Tier-2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

📌 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

▶️SSC CGL, CHSL, MTS & Havaldar మూడు రకాల ఉద్యోగాలకు ఉపయోగపడే Online Course + Test Series కేవలం ₹.499 రూపాయలకే అందించడం జరుగుతుంది. క్రింది లింకు పై క్లిక్ చేసి APP Install చేసుకుని మీకు కావాల్సిన కోర్సు తీసుకోగలరు.

📌APP Link

▶️ మీ మొబైల్ కి ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ రావాలి అంటే క్రింది Whatsapp Group, Telegram Group లో జాయిన్ అవ్వండి

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

Whatsapp Group

Telegram Group

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!