TGPSC Group-3: తెలంగాణ గ్రూప్-3 హాల్ టికెట్ అప్డేట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల హాల్ టికెట్లను నవంబర్ 10వ తారీఖున విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తెలిపింది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది.

తెలంగాణ నిరుద్యోగుల కోసం ” ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3″ ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

Download Our App

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షలను నవంబర్ 17, 18 తారీకుల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 17వ తారీఖున ఉదయం 10:00 గంటల నుంచి 12:30 నిమిషాల వరకు పేపర్-1 పరీక్షను, మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 5:30 నిమిషాల వరకు పేపర్-2 పరీక్షను, నవంబర్ 18వ తారీఖున ఉదయం 10:00 గంటల నుంచి 12:30 నిమిషాల వరకు పేపర్-3 పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్లో నవంబర్ 10 వ తారీకు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని పరీక్షలకు ఒకే హాల్ టికెట్ తీసుకెళ్లాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 387 మంది పోటీ పడుతున్నారు.

గ్రూప్-3 పరీక్షలను నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. మూడు పేపర్లలో కలిపి 450 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Hyderabad Anganwadi Jobs
Hyderabad Anganwadi Jobs: హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!