APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చెయాలి
APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయానికి అభ్యర్థనలు అందుతున్నాయి.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయానికి అభ్యర్థనలు అందుతున్నాయి. గ్రూప్-2 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఇచ్చినందున మెయిన్స్ పరీక్షకు ఎంపిక నిష్పత్తి పెంచాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీ అయ్యాక పరీక్షకు వ్యవధి తక్కువగా ఉందని, అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు చెబుతున్నారు.
మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ప్రధాన పరీక్ష (మెయిన్స్)కు ఎంపిక చేస్తున్నారు. అయితే, ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉన్నందున.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు.. ఏపీపీఎస్సీ కార్యదర్శి మరియు సభ్యులకు వినతి పత్రం అందించారు.
గ్రూప్-2 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఇచ్చినందున మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసే అభ్యర్థుల నిష్పత్తిని 1:100కు పెంచాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
గ్రూపు-2 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ యూపీఎస్సీ నిర్వ హించే సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయిలో ఉందని, కాబట్టి మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపికచేసి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని డీవైఎఫ్ఎ అధ్యక్ష కార్యదర్శులు ఏపీపీఎస్సీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.