AP Government Jobs: పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 26 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన చార్టెడ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రేడ్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు హెడ్ ఆఫీస్ విజయవాడలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎన్టీఆర్ జిల్లా అభ్యర్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. లోకల్ అభ్యర్థులు లేని పక్షంలో నాన్ లోకల్ అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

1.చార్టెడ్ అకౌంటెంట్: 01
2.అకౌంటెంట్ గ్రేడ్-3: 08
3.డేటా ఎంట్రీ ఆపరేటర్: 04
మొత్తం పోస్టుల సంఖ్య: 13

విద్యార్హతలు:

1.చార్టెడ్ అకౌంటెంట్: చార్టెడ్ అకౌంటెంట్ డిగ్రీ తో పాటు ఆడిట్ అండ్ అకౌంటింగ్ విభాగంలో ఒక సంవత్సరం పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2.అకౌంటెంట్ గ్రేడ్-3: చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్ పాసైన అభ్యర్థులు (లేదా) B.com + MBA (Finance) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

3.డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు MS Office కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Anganwadi Jobs: 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయోపరిమితి:

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

1.చార్టెడ్ అకౌంటెంట్: రూ.60,000/-
2.అకౌంటెంట్ గ్రేడ్-3: రూ.27,000/-
3.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-

ఎంపిక విధానం:

అకడమిక్ మార్కులు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్,
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్,
D.No.1013/A, గవర్నర్ పేట్,
విజయవాడ- 520002.

దరఖాస్తుకు చివరి తేదీ:

2023 నవంబర్ 3వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ధ్రువపత్రాల పరిశీలన తేదీ:

2023 నవంబర్ 10వ తారీకున ధ్రువపత్రాలను పరిశీలన చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!