AP Latest Jobs: ఆకాశవాణి విజయవాడ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 16 జిల్లాల్లో ఖాళీల భర్తీ
AP Jobs: ఆకాశవాణి విజయవాడ నుంచి పార్ట్ టైం కరస్పాండెంట్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16 జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ.. పలు జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం కరస్పాండెంట్ల (పీటీసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, విజయవాడ – అమరావతి జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
పార్ట్ టైమ్ కరస్పాండెంట్లు
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీతో అర్హతతో పాటు న్యూస్ రిపోర్టింగ్ లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్/ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి:
24 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ, అనుభవాన్ని ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
Head of Office,
Akashavani,
Punnamathota,
M.G.Road,
Vijayawada- 520010.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 3వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింద యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి