AP Grama Sachivalayam Jobs: గ్రామ/వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ 2023 అప్డేట్.. 13,026 పోస్టులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టులను అధికారులు సేకరించారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,026 ఖాళీ పోస్టులను గుర్తించారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

వీటిలో కొన్ని పోస్టులను కారుణ్య నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పు­న ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 13,026 పోస్టుల్లో దాదాపు 1149 పోస్టులను వీరికి కేటాయించనున్నారు. మిగిలిన 11,877 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలోలా కాకుండా ఈసారి 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Join Our Telegram Group

Grama Sachivalayam Online Coaching

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

శాఖల వారీగా అధికారులు గుర్తించిన ఖాళీల వివరాలు

గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు: 182
డిజిటల్ అసిస్టెంట్: 731
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: 543
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్: 467
హార్టికల్చర్ అసిస్టెంట్: 1005
సెరికల్చర్ అసిస్టెంట్: 24
వెటర్నరీ అసిస్టెంట్: 4765
ఫిషరీస్ అసిస్టెంట్: 62
ఇంజనీరింగ్ అసిస్టెంట్: 982
వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ: 112
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్: 1027
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ: 225
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ: 225
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ: 167
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ: 371
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ: 479
వార్డు ఎమినిటీస్ సెక్రటరీ: 477
ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ: 90
మహిళా పోలీసు (గ్రామ/వార్డు): 1092

మొత్తం ఖాళీలు: 13,026

కేటగిరి-1 పోస్టులు అయినటువంటి పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాల సిలబస్ వివరాలు కింద ఇవ్వడమైనది. కేటగిరి-1 పోస్టులు అన్నింటికీ ఒకే సిలబస్ ఉంటుంది. పరీక్షలు మాత్రం ఈసారి వేరువేరుగా నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో పార్ట్-A, పార్ట్-B అను రెండు పార్టులు ఉంటాయి. ఒక్కో పార్ట్ నుండి 75 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కేటగిరి-1 పోస్టుల సిలబస్

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

PART – A

జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

1.జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్.
2.డేటా ఇంటర్ ప్రేటేషన్ తో సహా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
3.రీడింగ్ కాంప్రహెన్షన్ – తెలుగు & ఇంగ్లీష్.
4.జనరల్ ఇంగ్లీష్.
5.ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం.
6.ప్రాంతీయ , జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కరెంట్ అఫైర్స్.
7.జనరల్ సైన్స్ మరియు నిత్యజీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి.
8.సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ.

PART – B

1.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి.
2.భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్. 73, 74 రాజ్యాంగ సవరణలు. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
3.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక.
4.సమాజం, సామాజిక న్యాయం మరియు హక్కుల సమస్యలు.
5.భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం.
6.ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయంపరమైన చిక్కులు/ సమస్యలు.
7.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు.
8.మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు.

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!