TSPSC Group-4: గ్రూప్-4 కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు ఏడు లక్షలు దాటాయి. శనివారం సాయంత్రానికి 7,41,159 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. రోజుకి సగటున 24 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య 9 లక్షలకు చేరువయ్యే అవకాశముంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Notification Link

Apply Online

Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Website

TG Anganwadi Notification 2026 – తెలంగాణలో 179 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!