APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘గ్రూప్-2’ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 686 పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబర్ 13వ తారీకున నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ నవంబర్ 10వ తారీఖు లోపు విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు శాఖల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జీఎస్టీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా 200 డిప్యూటీ తహశీల్దార్, 176 డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు


గ్రూప్-2 ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు మాత్రం డిగ్రీలో మ్యాథమెటిక్స్, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ పూర్తయి.. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు (లేదా) బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్ (లేదా) బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అర్హత అర్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రం 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్


ఈ పోస్టులకు నవంబర్ పదవ తారీకు నుంచి నవంబర్ 30 వ తారీకు వరకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
