APPSC FBO Notification 2026: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 23 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 16వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. డివిజన్ల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను అక్టోబర్ 16వ తారీకున విడుదల చేసే పూర్తిస్థాయి నోటిఫికేషన్లో విడుదల చేస్తారు.
ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు వుంటుంది. జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్టులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 16-10-2026 తేదీ నుంచి 05-11-2026 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

