TSLPRB ASI Notification 2026: తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 23 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ/ బిఈ/ బిటెక్/ BCA అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జోన్లవారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19 వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

